Thursday, 12 March 2026 12:34:04 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Canada: కెనడా ఆరోపణలపై భారత్ కౌంటర్ అటాక్

Date : 18 October 2024 11:55 AM Views : 269

Studio18 News - అంతర్జాతీయం / : కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్ కౌంటర్ ఇచ్చింది. కెనడాపైనే ఆరోపణలు చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉన్న వ్యక్తులను సరెండర్ చేయాలని అనేక మార్లు కోరినా కెనడా నుంచి ఎటువంటి స్పందన రాలేదని భారత్ పేర్కొంది. ఆ ముఠాపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని స్పష్టం చేసింది. ట్రూడో ప్రభుత్వం తీరు, నిరాధార ఆరోపణల వల్లే తాజా సంక్షోభం ఏర్పడిందని తెలిపింది. తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందిస్తూ .. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయాలని కెనడాకు అనేక సార్లు విజ్ఞప్తి చేసినా భారత్ ఆందోళనలను వారు పట్టించుకోవడం లేదని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆయన అన్నారు. నేరస్థుల అప్పగింత కేసులకు సంబంధించి ఇప్పటి వరకూ 26 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందని గతేడాది నుంచి కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. విచారణ కమిషన్ ముందు ఈ విషయాన్ని ట్రూడో అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా మళ్లీ భారత్‌పై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. భారత్ దౌత్యవేత్తలపై కెనడా చేసిన ఆరోపణలను మరోసారి ఆయన ఖండించారు. భారత వ్యతిరేక చర్యలను కెనడా ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :