Studio18 News - అంతర్జాతీయం / : Israel PM Netanyahu: పశ్చిమాసియా భగ్గుమంటోంది. తమ శత్రుమూకలను వేటాడి వెంటాడి మట్టుపెడుతున్న ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ సైతం లెబనాన్ రాజధాని బీరూట్ తోపాటు.. తమ శత్రుదేశాలపై వైమానిక దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య వార్ తీవ్రస్థాయికి చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు పలు దేశాల అధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుపై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోరిస్ జాన్సన్ అక్టోబర్ 10న ‘అన్‌లీషెడ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించాడు. ఈ పుస్తకంలో కీలక అంశాలను ప్రస్తావించారు. బ్రిటిష్ విదేశాంగ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో నేతన్యాహు హాజరయ్యాడు. ఆ సమయంలో తాను విదేశాంగ మంత్రిగా ఉన్నాను. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన బాత్రూం వాడినట్లు బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఆ సమయంలో ఆయన ఓ ఆడియో డివైజ్ పరికరాన్ని నా బాత్ రూమ్ లో అమర్చడం జరిగిందని ఆరోపించారు. నేను బాత్రూంలోకి వెళ్లిన సమయంలో నా మాటలను వినేందుకు ఆ పరికరాన్ని అమర్చాడని బోరిస్ అన్నారు. అయితే, బోరిస్ బాత్రూమ్ ను వదిలివెళ్లిన కొద్ది సేపటికే తన సెక్యూరిటీ సిబ్బంది దానిని కొనుగొన్నారని జాన్సన్ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ను ప్రశ్నించారా.. లేదా అనే విషయాన్ని పేర్కొనలేదు. ఇజ్రాయెల్ గత ఐదేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలో సెల్ ఫోన్ లతో కూడిన సర్వేలియన్స్ పరికరాలు అమర్చినట్లు విమర్శలు వచ్చాయి. ఒక్క వైట్ హౌజ్ దగ్గరే కాక.. ఇతర ప్రాంతాల్లోనూ సర్వేలియన్స్ ఎక్విప్ మెంట్ లను అమర్చినట్లు అమెరికా ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది. అమెరికా వాదనను ఇజ్రాయెల్ తప్పుబట్టింది. ఇజ్రాయెల్ అలా ఎప్పటికీ చేయదని ఆ దేశ ప్రధాని నెతన్యాహు అప్పట్లో స్పష్టం చేశారు.
Admin
Studio18 News