Saturday, 07 March 2026 08:45:04 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

హిందువే కానీ ఇండియన్ కాదు.. ఎవరీ తులసీ గబ్బార్డ్ ?

ట్రంప్ టీమ్ లో కీలక పదవి దక్కించుకున్న తులసి తొలుత డెమోక్రాట్, ఆపై ఇండిపెండెంట్, చివరకు రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష రేసులో నిలిచినా తుదకు

Date : 14 November 2024 01:20 PM Views : 407

Studio18 News - అంతర్జాతీయం / : పేరులో తెలుగుదనం, ఆచారంలో హిందుత్వం.. వీటిని చూసి ఆమె హిందువని, తెలుగు మూలాలు ఉన్నాయని చాలామంది పొరబడుతుంటారు. ఆమే.. తులసీ గబ్బార్డ్. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలొ తొలుత తాను కూడా రేసులో ఉన్నానని ప్రకటించి తులసి సంచలనం సృష్టించారు. చివరకు పోటీ నుంచి వైదొలిగి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తొలినాళ్లలో డెమోక్రటిక్ పార్టీలో కొనసాగిన తులసి, 2022లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. స్వంతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు మనసు మార్చుకుని డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిచ్చారు. అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్.. తాజాగా తులసిని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎంపిక చేశారు. తులసీ గబ్బార్డ్ భారత సంతతికి చెందిన నేత అని, ఆమె మూలాలు భారత్ లో ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాను హిందువునే తప్ప ఇండియన్ కాదని స్వయంగా తులసీ గబ్బార్డ్ స్పష్టం చేశారు. దీనిపై 2012లోనే ఓ ట్వీట్ చేశారు. కారోల్ గబ్బార్డ్, మైక్ గబ్బార్డ్ దంపతులకు అమెరికాలోని సమోవా ఐలాండ్ లో 1981లో జన్మించింది. తులసి తల్లి కారోల్ ఇండియానాకు చెందిన వారు కాగా తండ్రి మైక్ యురోపియన్ మూలాలున్న అమెరికన్ పౌరుడు. ఆయన సమోవాలో పుట్టిపెరిగారు. తులసికి రెండేళ్ల వయసుండగా గబ్బార్డ్ కుటుంబం హవాయీకి వలస వెళ్లింది. తులసి బాల్యం సమోవా, హవాయీ దీవులతో పాటు ఫ్లోరిడాలో గడిచింది. హిందుత్వంపై ఆసక్తితో కారోల్ గబ్బార్డ్ తన పిల్లలకు హిందూ పేర్లను పెట్టింది. తన సంతానం ఐదుగురిలో నాలుగో కూతురుకు తులసి అని నామకరణం చేసింది. కారోల్ గబ్బార్డ్ హిందూ ఆచారాలను పాటిస్తూ తన పిల్లలకు కూడా నేర్పింది. భగవద్గీత చదివించడం, వైష్ణవ హిందూ ఆర్గనైజేషన్ తో పాటు ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవుతుండేది. దీంతో టీనేజ్ కు వచ్చే సరికి తులసికి కూడా హిందుత్వంపై ఆసక్తి పెరిగింది. చిన్ననాటి నుంచి పాటిస్తున్న ఆచారాలను పాటిస్తూ హిందూ దేవుళ్లపై నమ్మకాన్ని పెంచుకుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తులసి పేరును, ఆచార వ్యవహారాలను చూసి ఆమె పూర్వీకులు భారతీయులని చాలామంది పొరబడ్డారు. ఈ విషయంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి తులసీ గబ్బార్డ్ 2012లో ఓ ట్వీట్ చేశారు. తాను హిందువునే కానీ ఇండియన్ కాదని అందులో స్పష్టం చేశారు.

Also Read : బట్టతలతో కనిపించిన ప్రభాస్ ఫొటో నెట్టింట వైరల్.. అసలు నిజం ఇదీ!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :