Sunday, 08 March 2026 04:34:46 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Indian: స్టార్ హోట‌ల్ ఎంట్ర‌న్స్‌ లోనే మ‌ల‌విస‌ర్జ‌న‌.. భార‌తీయ కార్మికుడికి రూ.25 వేల జ‌రిమానా!

Date : 20 September 2024 11:54 AM Views : 371

Studio18 News - అంతర్జాతీయం / : సింగ‌పూర్‌లోని మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌లో ఓ భార‌తీయ కార్మికుడు హోట‌ల్ ఎంట్ర‌న్స్‌లోనే మ‌ల‌విస‌ర్జ‌న చేశాడు. ఈ వ్య‌వ‌హారాన్ని తాజాగా విచారించిన కోర్టు అత‌డిని దోషిగా నిర్ధారించింది. అనంత‌రం కోర్టు అత‌డికి 400 సింగ‌పూర్ డాల‌ర్లు (భార‌తీయ క‌రెన్సీలో రూ.25వేలు) జ‌రిమానా విధించింది. వివ‌రాల్లోకి వెళితే.. వ‌ర్క్ ప‌ర్మిట్‌పై సింగ‌పూర్‌లో ఉంటున్న‌ భార‌త్‌కు చెందిన రాము చిన్న‌రాసా అనే కార్మికుడు గ‌తేడాది మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌కు వెళ్లాడు. అక్క‌డ త‌ప్ప‌తాగి క్యాసినోకు వెళ్లాడు. కొద్దిసేపు క్యాసినో ఆడిన అత‌డు.. బాత్‌రూమ్‌కు వెళ్లాల‌నుకున్నాడు. కానీ, మ‌ద్యం మ‌త్తులో బాత్‌రూమ్‌కు వెళ్లే దారి తెలియ‌క హోట‌ల్ ఎంట్ర‌న్స్‌లోనే మ‌ల‌విస‌ర్జ‌న చేశాడు. అనంత‌రం అక్క‌డి నుంచి నేరుగా బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. ఇది గ‌మ‌నించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రామును గుర్తించి ప్ర‌జారోగ్య నిబంధ‌న‌ల కింద పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 2023 అక్టోబ‌ర్ 30న జ‌రిగిన ఈ ఘ‌ట‌న తాలూకు ఫొటో అప్ప‌ట్లో బాగా వైర‌ల్ అయింది. ఇక ఈ ఏడాది జూన్ 4న రాము మ‌రోసారి అదే హోట‌ల్‌కు వెళ్లాడు. వెంట‌నే గుర్తించిన సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో హోట‌ల్‌కు వ‌చ్చిన‌ పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో రాము త‌న నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని తీవ్రంగా మంద‌లించిన జ‌డ్జి.. రూ.25వేల జ‌రిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :