Sunday, 08 March 2026 03:35:12 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత!

Date : 24 June 2025 03:36 PM Views : 470

Studio18 News - అంతర్జాతీయం / : పశ్చిమాసియాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలకు తెరదించుతూ కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గంటల్లోనే ఉల్లంఘనకు గురైంది. ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండు గంటలకే ఇరాన్ తమపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ చర్యకు గట్టిగా బదులిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైనిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ గగనతలంలోకి దూసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్‌లు మోగించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై కఠినంగా స్పందించాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)కు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. టెహ్రాన్‌లోని అత్యంత కీలకమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని స్పష్టం చేసినట్లు కాట్జ్‌ తెలిపారు. కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, ఇరాన్ నుంచి సైనిక ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారి ఒకరు ఈ దాడులకు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ వైమానిక దళాన్ని, సైన్యాన్ని పూర్తి అప్రమత్తంగా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనుందని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ దీనిపై స్పందించిన తీరు కొంత గందరగోళానికి దారితీసింది. తాము ఇంకా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదని చెబుతూనే, సైనిక చర్యలు ముగిశాయనే సంకేతాలు ఇచ్చింది. ఈ ప్రకటనల అనంతరం ఇరుదేశాల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇరాన్ అధికారికంగా ప్రకటించగా, ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని తాము కూడా అంగీకరించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే, ఈ ఒప్పందం కొన్ని గంటలకే నీరుగారిపోవడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :