Thursday, 12 March 2026 12:24:22 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా?

Date : 09 February 2026 07:18 PM Views : 33

Studio18 News - అంతర్జాతీయం / : 2019 ఆగస్టు 10న ఎప్‌స్టీన్ అనుమానాస్పద మృతి మరణ ప్రకటనను ఒకరోజు ముందు తయారు చేసినట్లు అనుమానాలు అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైళ్లలో ఆగస్టు 9గా ఉన్న తేదీ సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్ మృతి చెందడానికి ఒకరోజు ముందు అతని మరణ ప్రకటన సిద్ధం చేశారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్‌స్టీన్ 2019 ఆగస్టు 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో మాన్‌హట్టన్ జైలులో మృతి చెందాడు. అయితే, అతడి మరణ ప్రకటన ఒకరోజు ముందే తయారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో ఆ తేదీ ఆగస్టు 9గా ఉండటం గమనార్హం. ఎప్‌స్టీన్ జైలు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నాడు అధికారులు వెల్లడించారు. కానీ అతడి మరణంపై నాటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎప్‌స్టీన్ మరణించడానికి ఒకరోజు ముందు ఆరెంజ్ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎప్‌స్టీన్ జైలు గది వైపు కదులుతున్నట్లుగా సీసీటీవీ దృశ్యాలు వెలుగు చూశాయి. ఆ కదులుతున్న వ్యక్తి జైలు అధికారి అని న్యాయశాఖ చెబుతోంది. ఎప్‍‌స్టీన్ చనిపోయాడని గుర్తించిన తర్వాత తీసిన ఫొటోలను తాజాగా బహిర్గతం చేశారు. అతడు మరణించాడని గుర్తించిన 16 నిమిషాల తర్వాత బతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. అతడు మృతి చెందాడని ధృవీకరించిన అనంతరం ఆసుపత్రిలో తీసిన ఫొటోల్లో పేరును తప్పుగా రాశారు. ఇవి పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :