Thursday, 12 March 2026 12:11:16 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు!

Date : 09 February 2026 06:49 PM Views : 43

Studio18 News - జాతీయం / : యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు కొత్త మొబైల్ యాప్ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఈ సేవలను అందుబాటులోకి తేనున్న ఈపీఎఫ్ఓ కొత్త విధానంలో మూడు రోజుల్లోనే క్లెయిమ్‌ల పరిష్కారం, ఖాతాలోకి నగదు జమ ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.25,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలతో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్న కార్మిక శాఖ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సేవలను మరింత వేగవంతం, సులభతరం చేసే దిశగా ఒక విప్లవాత్మక అడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేలా సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను తీసుకురానుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలోని అర్హతగల మొత్తాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా తక్షణమే విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కలగనుంది. "ఈపీఎఫ్ఓ 3.0" అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ కొత్త డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం పీఎఫ్ డబ్బుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు పడుతోంది. కాగా, కొత్త ఆటో-సెటిల్‌మెంట్ విధానంలో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా మూడు రోజుల్లోనే క్లెయిమ్‌లు పరిష్కారమై, డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఏటా 5 కోట్లకు పైగా క్లెయిమ్‌లను పరిష్కరించే ఈపీఎఫ్ఓపై భారాన్ని తగ్గించి, బ్యాంకుల తరహాలో వేగవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కొత్త యాప్ ఫీచర్లు ఇవే.. ఈ కొత్త యూపీఐ విత్‌డ్రా వ్యవస్థలో పలు కీలక ఫీచర్లు ఉండనున్నాయి. సభ్యులు తమ యూపీఐ పిన్ ఉపయోగించి, అర్హత ఉన్న నిధులను దాదాపు తక్షణమే తమ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. వివాహం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం వంటి అత్యవసరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రాథమికంగా ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.25,000 వరకు విత్‌డ్రా చేసుకునే పరిమితిని ప్రతిపాదించారు. యాప్‌లో విత్‌డ్రాకు అందుబాటులో ఉన్న "అర్హతగల బ్యాలెన్స్" స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, పదవీ విరమణ భద్రత కోసం మొత్తం బ్యాలెన్స్‌లో కనీసం 25 శాతం లాక్ చేసి ఉంచుతారు. ప్రస్తుతం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 100 డమ్మీ ఖాతాలతో ఈ యాప్‌పై ట్రయల్ రన్స్ నిర్వహిస్తోంది. ఏవైనా సాంకేతిక సమస్యలుంటే గుర్తించి, పరిష్కరించిన తర్వాతే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త యాప్ యూపీఐ విత్‌డ్రాయల్స్‌కు ప్రధాన వేదికగా మారినప్పటికీ, ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్, ఉమాంగ్ (UMANG) యాప్ వంటి పాత ప్లాట్‌ఫామ్‌లు ఇతర సేవల కోసం యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :