Thursday, 12 March 2026 04:28:15 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Chhattisgarh: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ .. 25 మంది నక్సలైట్ల లొంగుబాటు

Date : 27 August 2024 04:32 PM Views : 388

Studio18 News - జాతీయం / : ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో 25 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డులు ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల గురించి బీజూపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వివరాలు మీడియాకు వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లు గంగ్లూర్ , బైరామ్‌గఢ్ ఏరియా కమిటీల్లో క్రియాశీలకంగా పని చేశారని చెప్పారు. ఇద్దరు మహిళా నక్సలైట్ లు కూడా లొంగిపోయినవారిలో ఉన్నారని తెలిపారు. శంబరి మద్యం (23), జ్యోతి పునెం (27), మహేశ్ తేలంపై ఒక్కొక్కరి తలపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉందని చెప్పారు. శంబరి మద్యం అనే మహిళ 2012 నుండి ఉద్యమంలో కీలకంగా పని చేశారనీ, 2020లో సుక్మా జిల్లాలో, 2021లో బీజాపూర్ లో భద్రతా సిబ్బందిపై జరిగిన భారీ దాడుల ఘటనల్లో ఆమె పాత్ర ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన విష్ణుకర్తమ్ అలియాస్ మోను, జైదీప్ పాడియంలపైనా రివార్డులు ఉన్నాయన్నారు. మావోయిస్టు భావజాలం పట్ల నిరాశ, ఉద్యమ నేతల దౌర్జన్యాల కారణంగా వీరు లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన వీరికి రూ.25వేల చొప్పున సాయంతో పాటు ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసాన్ని కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 346 మంది నక్సలైట్ లను అరెస్టు చేయగా, 170 మంది లొంగిపోయారని ఆయన తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :