Wednesday, 25 June 2025 08:01:51 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Subrahmanyam Jaishankar: అమెరికాలో ఎవరు గెలిచినా... వారితో కలిసి పని చేస్తాం: కేంద్రమంత్రి జైశంకర్

Date : 13 August 2024 02:52 PM Views : 170

Studio18 News - జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా... భారత్ వారితో కలిసి పని చేస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఇండియాస్పోరా ఇంపాక్ట్ రిపోర్ట్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశంపై స్పందించారు. సాధారణంగా ఇతర దేశాల ఎన్నికలపై మనం స్పందించబోమని... ఎందుకంటే ఇతరులు కూడా మన అంతర్గత అంశాల్లో మాట్లాడకూడదని భావిస్తామన్నారు. గత 20 సంవత్సరాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ భారత్ కలిసి ముందుకు సాగిందన్నారు. అందుకే ఈసారి కూడా అతను (ట్రంప్) లేదా ఆమె (కమలాహారిస్) ఎవరు గెలిచినా కలిసి పని చేస్తామనే విశ్వాసం ఉందన్నారు. అదే సమయంలో, ప్రస్తుతం మనం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కేంద్రమంత్రి అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ఆయన ఉదహరించారు. తాను ఆశావాదినని... సమస్యలకు పరిష్కారాల గురించే ఆలోచిస్తానన్నారు. అయినప్పటికీ తాను ఒకటి కచ్చితంగా చెబుతున్నానని... మనం కఠిన పరిస్థితిని (ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో) ఎదుర్కొంటున్నామన్నారు. రానున్న ఐదేళ్లు చాలా క్లిష్టమైనది అన్నారు. మిడిల్ ఈస్ట్‌లో ఏం జరుగుతోంది? ఉక్రెయిన్‌లో ఏమవుతోంది? ఆగ్నేయాసియా... తూర్పు ఆసియా... ఇలా వివిధ ప్రాంతాల్లో ఏమవుతుందో చూస్తూనే ఉన్నామన్నారు. అలాగే కొవిడ్ ప్రభావం నుంచి కొన్ని దేశాలు పూర్తిగా బయటపడలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సవాళ్లను వెల్లడిస్తూ... ఈనాడు ఎన్నో దేశాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయని తెలిపారు. ఒకరు వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటే... ఇంకొకరు విదేశీ మారకపు కొరతను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రకాల ఆటుపోట్లు ఉంటాయన్నారు. వాతావరణ మార్పులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :