Wednesday, 04 March 2026 09:26:21 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Digvijay Singh: అద్వానీ పాదాల వద్ద కూర్చున్న వ్యక్తి ప్రధాని అయ్యారు: ఆరెస్సెస్‌పై దిగ్విజయ్ ప్రశంస

Date : 27 December 2025 07:00 PM Views : 108

Studio18 News - జాతీయం / : అద్వానీ కుర్చీలో కూర్చుని ఉండగా, పాదాల వద్ద మోదీ కూర్చున్న ఫొటోను పంచుకున్న దిగ్విజయ్ ఇదీ ఆ సంస్థ గొప్పతనమంటూ ఆరెస్సెస్‌పై ప్రశంసలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేసిన దిగ్విజయ్ ఆరెస్సెస్‌లో సాధారణ కార్యకర్తగా పనిచేసి, అద్వానీ వంటి నాయకుడి పాదాల వద్ద నేలపై కూర్చున్న నరేంద్ర మోదీ ఆ తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎదిగారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గుజరాత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అద్వానీ కుర్చీలో కూర్చుని ఉండగా, నరేంద్ర మోదీ ఆయన కాళ్ల వద్ద కూర్చున్నప్పటి ఒకప్పటి ఫొటోను ఆయన పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తుండటం కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇప్పుడు థరూర్ బాటలో దిగ్విజయ్ సింగ్ బీజేపీ, ఆరెస్సెస్‌పై ప్రశంసలు కురిపించడం గమనార్హం. "నేను ఇటీవల ఒక ఫొటోను చూశాను. అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆరెస్సెస్‌లో సామాన్య కార్యకర్తలా, నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ శక్తి" అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :