Thursday, 05 December 2024 04:18:57 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pakistan man: పాకిస్థానీ భర్త, బంగ్లాదేశీ భార్య.. ఆరేళ్లుగా బెంగళూరులో కాపురం

Date : 01 October 2024 11:57 AM Views : 50

Studio18 News - జాతీయం / : దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థానీ పౌరుడు తప్పుడు పత్రాలతో పాస్ పోర్టు, ఆధార్ కార్డులను సంపాదించాడు. బంగ్లాదేశ్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకుని ఆమె తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో కాపురం పెట్టాడు. పేర్లు మార్చుకుని భారతీయులుగా చలామణీ అవుతున్నారు. గత నెలలో ఈ కుటుంబం ఫేక్ పాస్ పోర్టులతో బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైంది. ఆ తర్వాత మళ్లీ బెంగళూరుకు తిరిగొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ కు చెందిన రషీద్ అలీ సిద్దిఖీ, ఆయన భార్య ఆయేషా హనీఫ్ (బంగ్లాదేశ్ పౌరురాలు), ఆమె తల్లిదండ్రులు 2014లో అక్రమంగా పశ్చిమ బెంగాల్ లోకి ఎంటరయ్యారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుని 2018 వరకూ అక్కడే ఉన్నారు. ఆపై బెంగళూరుకు వచ్చి సిటీ శివార్లలోని ఓ విల్లాలో కాపురం ఉంటున్నారు. శంకర్ శర్మ, ఆశా శర్మగా పేర్లు మార్చుకుని, తప్పుడు పత్రాలతో ఇండియన్ పాస్ పోర్టు, ఢిల్లీ చిరునామాతో ఆధార్ కార్డులు సంపాదించారు. సిద్దిఖీ సిటీలో ఇంజన్ ఆయిల్ అమ్మే షాపు నడిపిస్తున్నాడు. ఈ కుటుంబం గత నెలలో బంగ్లాదేశ్ లోని ఢాకాకు వెళ్లి వచ్చింది. అక్కడ జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైంది. వీరి పాస్ పోర్టులు, డాక్యుమెంట్లపై అనుమానం రావడంతో చెన్నై ఇమిగ్రేషన్ అధికారులు బెంగళూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిద్దిఖీ ఉంటున్న విల్లాపై పోలీసులు సోమవారం రెయిడ్ చేసి నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :