Wednesday, 16 July 2025 10:47:55 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

కేంద్ర‌మంత్రి రామ్మోహన్‌నాయుడికి భ‌ద్ర‌త పెంపు

Date : 09 May 2025 11:15 AM Views : 46

Studio18 News - జాతీయం / : కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి భ‌ద్ర‌త పెంచారు. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం వై-కేటగిరీ భ‌ద్ర‌త ఉండ‌గా... దాన్ని ఇప్పుడు వై-ప్ల‌స్ కేట‌గిరీకి పెంచారు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇద్ద‌రు గ‌న్‌మెన్ల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు సీఆర్‌పీఎఫ్ అధికారుల‌తో క‌లిపి మొత్తంగా మంత్రికి న‌లుగురు సిబ్బంది భ‌ద్ర‌త‌గా ఉండ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన చీఫ్ సెక్యూరిటీ అధికారి, సీఆర్‌పీఎఫ్ క‌మాండో గురువారం విధుల్లో చేరారు. సీఎం చంద్రబాబు భద్రత.. పటిష్ట చర్యలకు డీజీపీ ఆదేశం అటు ఆపరేషన్ సిందూర్ తరువాత వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలు, ప్రజలు, సంస్థల రక్షణ, వీఐపీల భద్రతపై ఏపీలో ఉన్నతాధికారులు హైలెవల్ రివ్యూ చేశారు. ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా, ఇంటిలిజెన్స్ చీఫ్ మహేశ్‌ చంద్ర లడ్హాతో పాటు ఉన్నతాధికారులు సమీక్షకు హాజరు అయ్యారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు సెక్యూరిటీ విషయంలో పటిష్ట చర్యలకు డీజీపీ ఆదేశించారు. మరింత పటిష్టంగా ముఖ్య‌మంత్రి భద్రతా చర్యలు ఉండాలని ఇంటలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.సెక్యురిటీ ప్రొటోకాల్స్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. జన సమూహంలోకి సీఎం చంద్ర‌బాబు వెళుతున్న సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :