Studio18 News - జాతీయం / : హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన నటి కంగనా రనౌత్.. ఎంపీగా గురువారం మొదటిసారి పార్లమెంట్‌లో మాట్లాడారు. ‘‘మండీ నియోజకవర్గంలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మన హిమాచల్‌ప్రదేశ్‌లోని కత్-కుని అనే స్వదేశీ తయారీ సాంకేతికత ఉంది. గొర్రె చర్మాన్ని ఉపయోగించి జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెటర్లు వంటి పలు రకాల దుస్తులు తయారు చేస్తారు. ఈ ఉత్పత్తులకు విదేశాల్లో చక్కటి గుర్తింపు ఉంది. విలువైనవిగా పరిగణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఉత్పత్తులు కనుమరుగువుతున్నాయి. వీటి తయారీని ప్రోత్సహించేందుకు మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సభలో చర్చించాలి’’ అని కంగనా అన్నారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో జానపద సంగీతం కూడా అంతరించిపోయే పరిస్థితిలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్పితి, కిన్నౌర్, భర్మోర్ గిరిజన జానపద సంగీతాలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయని తాను చెప్పదలచుకున్నానని ఆమె చెప్పారు. జానపది సంగీత పునరుజ్జీవానికి తామంతా ఏం చేస్తున్నామో మాట్లాడాని ఆమె అన్నారు. ఈ మేరకు తన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా షేర్ చేశారు. పార్లమెంటులో మాట్లాడే అవకాశం కల్పించిన స్పీకర్ ఓం బిర్లాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌లో ఆమె హిందీలో మాట్లాడారు.
Admin
Studio18 News