Studio18 News - జాతీయం / : చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ దుర్ఘటనకు బాధ్యులని భావిస్తున్న పలువురు కీలక అధికారులపై చర్యలు తీసుకుంటున్న సిద్దరామయ్య ప్రభుత్వం, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి కె. గోవిందరాజ్‌ను పదవి నుంచి తొలగించగా, ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్‌ను బదిలీ చేసింది. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, ఇదివరకే గురువారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌తో పాటు మరికొందరు కీలక పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ చర్యలు తీసుకున్న మరుసటి రోజే, శుక్రవారం మరో ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు వేయడం గమనార్హం. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె. గోవిందరాజ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, హేమంత్ నింబాల్కర్‌ను ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి, బదిలీ చేసింది.
Admin
Studio18 News