Sunday, 08 February 2026 11:37:49 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

తండ్రికి ఇచ్చిన మాట నిలుపుకోకుండానే ఎయిరిండియా పైలెట్ విషాదాంతం

Date : 13 June 2025 03:22 PM Views : 430

Studio18 News - జాతీయం / : గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని విషాదానికి గురిచేసింది. ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు కింద ఉన్న కొందరు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 297కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో మరణించిన విమాన కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌ (ముంబైలోని పొవై నివాసి) వ్యక్తిగత జీవితంలోని ఓ విషాద కోణం అందరినీ కదిలిస్తోంది. సుమీత్‌కు పైలట్‌గా 8,200 గంటల అపార అనుభవం ఉంది. 1994 నుంచి పైలట్‌గా సేవలందిస్తున్న ఆయన, తన వృత్తికే జీవితాన్ని అంకితం చేశారు. వివాహం కూడా చేసుకోకుండా, వయసు పైబడి అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి బాగోగులు చూసుకుంటున్నారు. కొద్దికాలం క్రితమే, "నాన్నా, పైలట్ ఉద్యోగం మానేసి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను" అని తన తండ్రికి సుమీత్ మాట ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. కానీ, ఆ మాట నిలబెట్టుకోకుండానే, తండ్రి కన్నా ముందే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొడుకు మరణంతో ఆ వృద్ధ తండ్రి ఇప్పుడు ఒంటరివాడయ్యారంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ ఘటనతో అహ్మదాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విదేశాల్లో స్థిరపడాలని కలలుగన్నవారు, పర్యాటకులు, విద్యార్థులు ఇలా ఎందరో ఈ ప్రమాదంలో అసువులు బాశారు. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :