Thursday, 12 March 2026 03:40:59 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

త్వరలో నాకూ ప్రమోషన్ వస్తుందనుకుంటున్నా: ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా

Date : 06 June 2025 04:47 PM Views : 317

Studio18 News - జాతీయం / : జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తనకు కూడా ప్రధాని మోదీ పదోన్నతి కల్పిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సమక్షంలో, చినాబ్ వంతెన ప్రారంభోత్సవ సభలో ఒమర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీని ఉద్దేశించి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, "2014లో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ ఇప్పుడు, ఒక కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా నేను డిమోట్ అయ్యాను. అప్పట్లో రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్న వ్యక్తికి (ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను ఉద్దేశిస్తూ) లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదోన్నతి లభించింది. త్వరలోనే నాకూ పదోన్నతి లభిస్తుందని ఆశిస్తున్నాను. దీన్ని సరిదిద్దడానికి ఎక్కువ సమయం పట్టదని నేను భావిస్తున్నాను" అని అన్నారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి 2014 వరకు, జమ్ముకశ్మీర్‌ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే, 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)-కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో, కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌కు ఒమర్ అబ్దుల్లా తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :