Studio18 News - జాతీయం / : భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వ్యాపార వర్గాల్లో కలకలం బయల్దేరింది. రతన్ టాటాకి ఏమైందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో, రతన్ టాటా స్వయంగా స్పందించారు. ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. "నా ఆరోగ్యం గురించి ఇటీవల వస్తున్న పుకార్లు నా దృష్టికి వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. నా వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ప్రస్తుతం కొన్ని వైద్యపరమైన పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నేను ప్రస్తుతం ఉల్లాసంగానే ఉన్నాను. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ప్రజానీకాన్ని, మీడియాను కోరుతున్నాను" అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. అంతేకాదు, తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Studio18 News