Monday, 23 June 2025 02:24:58 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బంప‌రాఫ‌ర్‌.. రూ.1కే ఆటో రైడ్‌.. ఎక్క‌డంటే..!

Date : 02 October 2024 02:27 PM Views : 121

Studio18 News - జాతీయం / : ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ బంప‌రాఫ‌ర్ ప్ర‌క‌టించింది. బెంగ‌ళూరు ప్ర‌జ‌ల‌కు కేవ‌లం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. గ‌త నెల 27 నుంచి ప్ర‌క‌టించిన‌ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ సంద‌ర్భంగా త‌మ యూపీఐ పేమెంట్స్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు సంస్థ తెలిపింది. దీనికోసం న‌గ‌రంలోని ఆటో డ్రైవ‌ర్ల‌తో ఒప్పందం చేసుకుంది. ఇక రూపాయికే ఆటో రైడ్ కావ‌డంతో దీనికి మంచి స్పంద‌న వ‌స్తోంది. కేవ‌లం రూ.1 చెల్లించి బెంగ‌ళూరు వాసులు ఆటో రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పీక్ అవ‌ర్స్ లో ర‌ద్దీ దృష్ట్యా సంస్థ ప‌లు ప్రాంతాల్లో స్టాళ్ల‌ను కూడా ఏర్పాటు చేసింది. "ఫ్లిప్‌కార్ట్ యూపీఐ అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. బిగ్ బిలియ‌న్ డేస్ సేల్‌లో ఉత్సాహాన్ని నింప‌డానికి బెంగ‌ళూరులో ర‌ద్దీ స‌మ‌యాల్లో ఒక్క రూపాయికే ఆటో రైడ్‌ల‌ను అందించ‌డం జ‌రుగుతుంది. రూ.1కి ఏదీ ల‌భించ‌ని ఈ స‌మ‌యంలో మా ప్ర‌చారం చరిత్ర సృష్టించింది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ఎంత సౌక‌ర్య‌వంతంగా ఉంటుందో చూపిస్తూ జీవితాన్ని సుల‌భ‌త‌రం చేస్తోంది. చౌక‌గా ల‌భిస్తోంది" అని ఆ సంస్థ పేర్కొంది. ఇక ఒక్క రూపాయికే ఆటో రైడ్ అందుబాటులో ఉండ‌డంతో న‌గ‌ర వాసులు భారీ సంఖ్య‌లో క్యూ క‌ట్టిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయ్యాయి. దీంతో త‌మ ప్ర‌చారానికి అద్భుత స్పంద‌న ల‌భించింద‌ని కంపెనీ వెల్ల‌డించింది. ర‌ద్దీ స‌మ‌యాల్లో ప్ర‌యాణాల‌ను సుల‌భ‌త‌రం చేయ‌డంతో పాటు న‌గ‌దుర‌హిత సేవ‌ల‌ను ప్ర‌మోట్ చేసేందుకే ఈ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చిన‌ట్లు ఫ్లిప్‌కార్ట్ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఆఫ‌ర్‌ను బెంగ‌ళూరుకే ప‌రిమితం చేయ‌కుండా త‌మ ప్రాంతాల‌లో కూడా ప్ర‌వేశ‌పెట్టాలంటూ ఫ్లిప్‌కార్ట్‌ను ప‌లువురు కోరుతున్నారు. ఇలాంటి సేవ‌లు పొంద‌కుండా ఉండేందుకు తామేం త‌ప్పు చేశామ‌ని, త‌మ‌కూ త‌క్ష‌ణ‌మే ఇలాంటి ఆఫ‌ర్ ప్ర‌క‌టించాల‌ని ఇత‌ర ప్రాంతాల వాసులు కంపెనీని కోరుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :