Wednesday, 04 March 2026 09:26:59 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

Kuldeep Singh Sengar: ఉన్నావ్ అత్యాచార కేసు... కీలక ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

Date : 23 December 2025 06:36 PM Views : 109

Studio18 News - జాతీయం / : కుల్దీప్ సింగ్‌కు ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును నిలిపివేసిన హైకోర్టు కుల్దీప్ సింగ్ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో శిక్షను సస్పెండ్ చేసినట్లు వెల్లడి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం ఉన్నావ్ అత్యాచార ఘటన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించిన కుల్దీప్ సింగ్ సెంగర్‌కు విధించిన జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిలిపివేసింది. ఉన్నావ్ అత్యాచార కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ 2019లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కుల్దీప్ సింగ్ దాఖలు చేసిన అప్పీల్ పెండింగ్‌లో ఉండటంతో అతడి శిక్షను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీశ్ వైద్యనాథన్ శంకర్‌లతో కూడిన ధర్మాసనం కుల్దీప్ సింగ్‌ను బెయిల్‌పై విడుదల చేసింది. ఇందుకోసం రూ.15 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశించింది. నిందితుడు బాధితురాలి ఇంటి పరిధిలోకి వెళ్లకూడదని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరింపులకు పాల్పడకూడదని షరతు విధించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్ విచారణలో అతడు దోషి అని తేలితే పూర్తి శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. 2017లో కుల్దీప్ సింగ్ యూపీలోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. 2019న ఆగస్టు 1 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతనిపై ఉన్న కేసులను ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :