Wednesday, 25 June 2025 07:53:36 AM
# గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Congress : హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. జులానా బరిలో వినేశ్ ఫొగాట్

Date : 07 September 2024 11:28 AM Views : 117

Studio18 News - జాతీయం / : Haryana Congress Candidate List 2024 : హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాత్రి తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తొలి విడతలో 31 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసింది. వినేశ్ ఫొగట్ తో పాటు టోక్యా ఒలంపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారిలో వినేశ్ ఫొగట్ కు తొలి జాబితాలో టికెట్ దక్కింది. ఆమె జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. బజరంగ్ పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ (ఏఐకేసీ) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మొదటి జాబితాలో 31 మందిలో 28మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కింది. వారిలో దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ కరణ్ కు కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. తొలి జాబితాలో ఐదుగురు మహిళలకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించింది. వీరిలో నారాయణగఢ్ నుంచి శైలీ చౌదరి, సధౌరా నుంచి రేణుబాలా, కలనౌర్ నుంచి శకుంతలా ఖటక్, ఝజ్జర్ నుంచి గీతా భుక్కల్, జులనా నుంచి వినేశ్ ఫోగట్ పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో జాట్ వర్గానికి తొమ్మిది సీట్లు దక్కగా.. ముస్లింలకు మూడు, గుర్జర్ వర్గానికి చెందిన ముగ్గురికి అవకాశం కల్పించారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన కుల్దీప్ శర్మ స్థానంలో ఫరీదాబాద్ ఎన్ఐటీ నుంచి నీరజ్ శర్మను అభ్యర్థిగా నియమించారు. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రావ్ దాన్ సింగ్ మహేంద్రగఢ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు చిరంజీరావు రేవారి నుంచి పోటీ చేయనున్నారు. షంషేర్ సింగ్ జోగి సిక్కు జాట్ గా అసంధ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే, తొలి జాబితాలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, లోక్ సభ ఎంపీ కుమారి సెల్జాలకు టికెట్లు ఇవ్వలేదు. అయితే, వారిద్దరూ పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :