Sunday, 08 March 2026 03:37:29 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Nitin Gadkari: నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశం రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చ కోమటిరెడ్డి వెంట ఎంపీలు వంశీకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డి

Date : 11 March 2025 05:20 PM Views : 329

Studio18 News - జాతీయం / : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ భేటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డి ఉన్నారు.

గురుకులాల నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఎంపీల హర్షం తెలంగాణలోని 55 సమీకృత గురుకులాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధుల కేటాయింపుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, రామసహాయం రఘురామరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఒక్కో పాఠశాలకు రూ. 200 కోట్లు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి అని వారు పేర్కొన్నారు. పేద పిల్లలకు నాలుగో తరగతి నుండి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు రూపకల్పన చేసిందని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుండి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నిధుల అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలిచినా వెళతామని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :