Thursday, 14 November 2024 06:19:29 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

Nitish Kumar: నితీశ్ ప్రధాని అవుతారన్న మంత్రి జమాఖాన్... బీహార్‌లో మళ్లీ చెడుతున్న బీజేపీ-జేడీయూ బంధం

Date : 04 October 2024 02:44 PM Views : 23

Studio18 News - జాతీయం / : బీహార్‌లో బీజేపీ, జేడీయూ కూటమి మధ్య మరోమారు మాటల యుద్ధం మొదలైంది. ఇరు పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జేడీయూ నేత, మంత్రి జమాఖాన్.. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ విభేదిస్తూ కనిపించారు. కేంద్రమంత్రిగా, దాదాపు 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ ఈ దేశానికి ప్రధాని అవుతారని, ఆయనను ప్రధానిని చేయడంలో ప్రతిపక్షాలు కూడా మద్దతునిస్తాయని జమాఖాన్ పేర్కొన్నారు. నితీశ్ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు మద్దతునిస్తాయని తెలిపారు. బీహార్ మాత్రమే కాకుండా దేశం మొత్తం ఆయన ప్రధాని కావాలని కోరుకుంటోందని చెప్పారు. ఆయన ప్రధాని అయితే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆయనకు కుటుంబ నేపథ్యం లేదని, ఆయనపై ఎలాంటి మచ్చలేదని చెప్పుకొచ్చారు. ప్రధాని కుర్చీ ఖాళీ లేదు జమాఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్‌లో కూటమి ప్రభుత్వం మధ్య విభేదాలకు కారణమయ్యాయి. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ మట్లాడుతూ ప్రధాని పదవి ప్రస్తుతం ఖాళీగా లేదని అన్నారు. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఇజ్రాయెల్ చంపినప్పటి నుంచి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పారు. జమాఖాన్ మంత్రి కాబట్టి నితీశ్‌ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో మాట్లాడాలని, వారికేం చెప్పాలో జమాఖాన్ కు నితీశ్ చెబుతారని పేర్కొన్నారు. బీజేపీ సంగతి జేడీయూకు అర్థమైంది మరోవైపు, బీజేడీ, బీజేపీ మధ్య మాటల యుద్ధంపై ప్రతిపక్ష ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ స్పందించారు. నితీశ్‌ను సీఎం సీటు నుంచి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయం జేడీయూకు అర్థమైంది కాబట్టే నితీశ్‌ను ప్రధాని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ కనుక ఇలాంటి పిచ్చి ప్రయత్నం ఏదైనా చేస్తే కేంద్రంలో ఎన్డీయేకు ఇస్తున్న మద్దతును జేడీయూ ఉపసంహరించుకుంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కుర్చీని డిమాండ్ చేయడానికి ముందు బీహార్‌లో నితీశ్‌ను రక్షించేందుకు జేడీయూ ప్రయత్నిస్తే మంచిదని హితవు పలికారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :