Studio18 News - జాతీయం / : ఓ ఇంట్లో చోరీకొచ్చిన దొంగల ముఠా తీరిగ్గా పకోడీలు వండుకుని తిని ఆపై లక్షల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిందీ ఘటన. తొలుత సెక్టార్ 82కు చెందిన శ్రీరామ్ త్రిపాఠి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు నేరుగా చోరీకి పాల్పడకుండా తొలుత వంటగదిలోకి వెళ్లి పకోడీలు వండుకుని తిన్నారు. ఆ తర్వాత ఇంట్లోని రూ. 40 లక్షల విలువైన నగదు, బంగారం, ఇతర సామాన్లను మూటగట్టుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా పలు ఇళ్లలో ఈ ముఠా చోరీలకు పాల్పడింది. రిచా బాజ్‌పాయ్ నివాసంలోకి చొరబడిన దొంగలు రూ. 3 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆమె ఇంట్లో బీడీలు కాల్చి, పాన్ నమిలి బాత్రూంలో ఉమ్మేసినట్టు గుర్తించారు. మరికొన్ని ఇళ్లలో భోజనం చేశారు. ఒకే రోజులో పదుల సంఖ్యలో దొంగతనాలు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూకట్టారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల ముఠా కోసం గాలింపు మొదలుపెట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Admin
Studio18 News