Thursday, 15 May 2025 02:06:05 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Union Budget 2024: 'ప్రత్యేక హోదా' డిమాండ్ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌పై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందన

Date : 23 July 2024 04:55 PM Views : 172

Studio18 News - జాతీయం / : బీహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఎన్డీయే భాగస్వామ్య పక్ష పార్టీ అయిన జేడీయూ బడ్జెట్ ముందు నుంచి డిమాండ్ చేస్తోంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో ఈ మేరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఆ రాష్ట్రానికి రూ.26 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది. దీంతో బడ్జెట్‌పై స్పందించిన బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను నిరంతరం ప్రత్యేక హోదాను కోరుతూనే ఉన్నానని, ప్ర‌త్యేక హోదా లేదా ప్ర‌త్యేక ప్యాకేజ్ ఏదో ఒకటి ఇవ్వాలని ఎన్‌డీఏ పెద్దలను అడిగానని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. తాను అడిగినందునే చాలా విషయాల్లో సాయం ప్ర‌క‌టించారని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్ర‌త్యేక హోదా గురించి తాము మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ఇందుకు సంబంధించిన నిబంధనలకు గతంలోనే ముగింపు పలికామని చెబుతున్నారని, కాబట్టి బీహార్‌కు ప్రత్యేక సాయం అందించాల్సి ఉందని, అది మొదలైందని ఆయన అన్నారు. ఇక బడ్జెట్‌ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని మీడియా ప్రశ్నించగా.. ప్రత్యేక హోదా అయినా.. ప్రత్యేక ప్యాకేజీ అయినా ఏదో ఒకటి కావాలని డిమాండ్ చేసిందని తామేనని వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. బీహార్‌లో రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.26,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. అంతేకాకుండా పలు ప్రాజెక్టులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :