Saturday, 24 January 2026 07:39:09 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Satyendar Jain: రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్.. స్వాగతం పలికిన కేజ్రీవాల్

Date : 19 October 2024 01:34 PM Views : 392

Studio18 News - జాతీయం / : ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన 18 నెలల సుదీర్ఘ కారాగారవాసాన్ని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉటంకిస్తూ, ఇంకా విచారణే ప్రారంభం కాలేదని పేర్కొంటూ జైన్‌కు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆప్ నేత మనీశ్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. సత్వర విచారణ హక్కును ప్రాథమిక హక్కుగా పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రజైన్‌ను ఈడీ 2022 మే 30న అరెస్ట్ చేసింది. కోర్టు తీర్పును వెల్లడిస్తూ మనీలాండరింగ్ వంటి కఠిన చట్టాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని ఎత్తి చూపింది. కాగా, ఈ కేసును విచారిస్తున్న ఈడీ జైన్ బెయిలు దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, కేసు విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని, త్వరలో కేసును ముగించాలని ఆదేశించింది. హత్తుకుని ఆహ్వానించిన కేజ్రీవాల్ శనివారం తీహార్ జైలు నుంచి విడుదలైన సత్యేంద్రజైన్‌ను కేజ్రీవాల్ ఆహ్వానించారు. ‘వెల్కం బ్యాక్ సత్యేంద్ర’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. జైన్‌ను ఆలింగనం చేసుకున్న రెండు ఫొటోలను షేర్ చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సత్యేంద్రజైన్ మాట్లాడుతూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై అణచివేతకు దిగుతోందని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :