Monday, 23 June 2025 03:01:20 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

Manish sisodia : బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మనీశ్ సిసోడియా.. ప్రజలకు కీలక విజ్ఞప్తి

Date : 10 August 2024 03:32 PM Views : 142

Studio18 News - జాతీయం / : Manish sisodia : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈసీ, సీబీఐ కేసుల్లో గత 17నెలలుగా తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. కాగా శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయంకు వచ్చారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో కార్యాలయంకు వచ్చిన ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి సిసోడియా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అన్ని శక్తులు ఏకతాటిపైకి వచ్చినా సత్యాన్ని ఓడించలేవు అని అన్నారు. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. బజరంగబలి దయ వల్ల నేను 17నెలల తరువాత విడుదలయ్యాను. విజయానికి ఒకేఒక మంత్రం ఉంది. ఢిల్లీలోని ప్రతి చిన్నారికి అద్భుతమైన పాఠశాలను నిర్మించాలి. మేము రథానికి గుర్రాలం. మన నిజమైన రథసారధి జైలులో ఉన్నాడు. అతను బయటకు వస్తాడు. జైలు తాళాలు పగలగొట్టి కేజ్రీవాల్ ను విడుదల చేస్తారని సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఒక్క రాష్ట్రంలో కూడా నిజాయితీగా పనులు జరుగుతున్నాయని నిరూపించుకోలేక పోయిందని సిసోడియా విమర్శించారు. తీవ్రవాదులు, డ్రగ్స్ మాఫియాపై విధించాల్సినటువంటి సెక్షన్లను నాపై, సంజయ్ సింగ్ పై విధించడానికి వారు ప్రయత్నించారు. తద్వారా జీవితకాలం జైలులో ఉంచాలని వారు చూశారని అన్నారు. బీజేపీకి ఓకేఒక్క నైపుణ్యం ఉంది. అదేమిటంటే.. ఇతర పార్టీల్లోని నాయకులను విడగొట్టి, రకరకాల శిక్షలతో జైళ్లకు పంపించడం. వారిపై మానసికంగా దాడి చేయడం. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది ఆప్ కార్యకర్తలే కాదు.. ఆ బాధ్యత దేశంలోని ప్రతి సామాన్యుడిది. బీజేపీ కుట్రలను గ్రహించి ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :