Studio18 News - జాతీయం / : న్యూఢిల్లీ: లోక్‌సభ(Lok Sabha)లో ఇవాళ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి చైర్‌పై విసిరేసిన ఘటనలో ఈ చర్య తీసుకున్నారు. చైర్‌లో దిలీప్ సైకియా ఉన్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు తమకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పేపర్లను చింపి విసిరేశారు. సస్పెండ్ అయిన వారిలో మానికం ఠాగూర్, గురీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరణ్ రెడ్డి, వెంకట్ రామన్ ఉన్నారు. చైర్‌పై పేపర్లు విసిరేయడాన్ని స్పీకర్ ఖండించారు. పార్లమెంటరీ హుందాతనాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. బడ్జెట్ సెషన్‌లో ఇలాంటి ఘటనలను ఉపేక్షించలేమన్నారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు. పార్లమెంట్‌లో సమస్యలను లేవనెత్తే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, సభ అందరిదని, చర్చలు జరగాలని, కానీ సభా వ్యవహారాలను అడ్డుకోవడం సరికాదు అని, నిరసన పేరుతో సభా నిర్వహణను స్తంభింపచేయడం కుదరదని దిలీప్ సైకియా అన్నారు. ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తప్పుపట్టారు. ప్రతి సభ్యుడిని మాట్లాడే హక్కు ఉందని, వారి ఆందోళనలను వినిపించుకోవాలని ఆమె అన్నారు. ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
Admin
Studio18 News