Thursday, 05 December 2024 08:50:29 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Aadhaar: ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం

Date : 31 August 2024 02:16 PM Views : 45

Studio18 News - జాతీయం / : ప్రభుత్వ సేవలు పొందేందుకు, గుర్తింపు నిర్ధారణకు అత్యంత ప్రామాణికమైన ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం ఉచితంగా సౌలభ్యం కల్పిస్తోంది. ఈ ఉచిత సర్వీస్ సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇప్పటికే యూఐడీఏఐ పలుమార్లు ఈ గడువును పొడిగించింది. దీంతో మరోసారి పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు డెడ్‌లైన్ లోగా త్వరపడడం మంచిది. కాగా ఆధార్‌ ఉచిత అప్‌డేట్ గడువును యూఐడీఏఐ అనేకసార్లు పొడిగించింది. మరోసారి పొడగింపుపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న గడువును జూన్ 14న మూడు నెలలపాటు పెంచింది. అంతకుముందు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది మార్చి 14 వరకు పొడిగించింది. కాగా ఆధార్ కార్డ్ వినియోగదారులు గుర్తింపు ఆధారాలు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. గత పదేళ్లలో ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్ చేసుకోకుంటే ఎలాంటి ఛార్జీలు లేకుండానే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్‌తో అనుసంధానమైన రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. దానికి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్‌లో పేరు, మొబైల్ నంబర్, ఫోటో వంటి ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే యూఐడీఏఐ అధికారిక కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. కాగా యూఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు ప్రతి 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. తద్వారా చిరునామా, ఇతర వివరాలు అప్‌డేట్ అవుతుంటాయని, ప్రభుత్వ పథకాలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని యూఐడీఏఐ చెబుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :