Saturday, 17 January 2026 10:26:17 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

పాక్ షెల్లింగ్‌లో కవలల మృతి.. ప్రాణాలతో పోరాడుతున్న తండ్రి

Date : 13 May 2025 11:54 AM Views : 310

Studio18 News - జాతీయం / : జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాక్ షెల్లింగ్‌లో 12 ఏళ్ల వయసున్న కవల సోదరులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారి తండ్రి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోయా ఖాన్, అయాన్ ఖాన్ అనే కవలలు గత నెలలోనే తమ 12వ జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ నెల 7న పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో భాగంగా దూసుకొచ్చిన మోర్టార్ షెల్ తమ అద్దె ఇంటిపై పడటంతో నిమిషాల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో చిన్నారుల అత్త, మామ కూడా ప్రాణాలు విడిచారు. పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు రెండు నెలల క్రితమే ఈ కుటుంబం పూంఛ్‌కు వలస వచ్చినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన చిన్నారుల తండ్రి రమీజ్ ఖాన్ (48) ప్రస్తుతం జమ్మూలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయన కాలేయం దెబ్బతిన్నట్టు వైద్యులు తెలిపారు. రమీజ్ ఖాన్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదన్న ఉద్దేశంతో పిల్లల మరణవార్త ఆయనకు తెలియకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడుతున్నారు. కన్నబిడ్డలను కోల్పోయిన దుఃఖం ఒకవైపు, భర్త ప్రాణాలతో పోరాడుతుండటం మరోవైపు.. ఈ రెండింటి మధ్య తల్లి ఉర్షా ఖాన్ మానసికంగా కుంగిపోయారని సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :