Sunday, 08 March 2026 09:48:20 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Fact check: ఈ మువ్వన్నెల జెండా చిక్కుముడిని పక్షి నిజంగానే విప్పిందని అనుకుంటున్నారా?

Date : 17 August 2024 05:32 PM Views : 455

Studio18 News - జాతీయం / : Viral Video: స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేరళలో అద్భుతం చోటుచేసుకుందంటూ ఓ పక్షికి చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జాతీయ జెండాను ఎగురవేసిన సమయంలో అది పోల్ చివరి భాగంలో చిక్కుకుపోగా ఓ పక్షి వచ్చి ఆ చిక్కును విప్పి మువ్వన్నెల జెండాను గాలిలోకి ఎగిరేలా చేసిందని చాలా మంది అనుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో నిజం లేదు. జెండా కాసేపు ఇరుక్కుపోయిన విషయం నిజమే.. కానీ, ఆ జెండా చిక్కుముడిని పక్షి విప్పలేదు. పక్షి వచ్చి చెట్టు ఆకులపై వాలుతుంది.. అది కెమెరా యాంగిల్‌ వల్ల పక్షే జెండా చిక్కుముడిని విప్పినట్లు కనపడుతోంది. చెట్టుకొమ్మపై వాలిన పక్షి.. అక్కడి వారు జెండాను ఆవిష్కరించాక ఎగిరిపోవడం వల్ల అలా కనపడింది. మరో యాంగిల్లో తీసిన వీడియోలో అసలు ఆ పక్షి జెండాను ముట్టుకోలేదని, అది చెట్టు ఆకులపైనే ఉందని స్పష్టంగా గమనించవచ్చు. వైరల్ అయిన వీడియోను, ఒరిజినల్‌ వీడియోను చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం అవుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :