Monday, 30 March 2026 03:10:10 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Donald Trump: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

Date : 03 February 2026 07:46 PM Views : 85

Studio18 News - జాతీయం / : రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్న కేంద్ర ప్రభుత్వం అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలు తగ్గించేందుకు ససేమిరా వెనెజువెలా చమురు కొనుగోలు చేస్తామన్న కేంద్రం అమెరికాతో వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో, రైతుల ప్రయోజనం అంశంపై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం జరిగిందని, అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పోస్టు నేపథ్యంలో విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం స్పందించింది. అమెరికా మన దేశానికి ఎగుమతి చేసే వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించేందుకు మొదటి నుంచి అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. వాణిజ్య ఒప్పందం నేపథ్యంలోనూ అదే విషయాన్ని స్పష్టం చేశామని పేర్కొంది. వెనెజువెలా చమురు కొనుగోలు అంశం పరిశీలలో ఉందని తెలిపింది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు మనం వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేయలేదని, ఇప్పుడు వాటిని ఎత్తివేశారని పేర్కొన్నారు. చమురు కొనుగోలు చేస్తామన్నారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు చాలా తక్కువకు వస్తాయి. వాటిపై సుంకాలు తగ్గిస్తే మన దేశంలో రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంతకాలం వాణిజ్య చర్చల ప్రతిష్ఠంభనకు ఇది ప్రధాన కారణం. మన రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి వాణిజ్యం ఒప్పందం కోసం కేంద్రం ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వాణిజ్య ఒప్పందం కుదరడంతో వస్తున్న విమర్శలకు కేంద్రం స్పష్టతనిచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :