Studio18 News - జాతీయం / : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి జాతీయ, ప్రాంతీయ మీడియా ఛానెళ్లు విస్తృతంగా కవరేజీ ఇస్తున్నాయి. అయితే, పౌరులను అప్రమత్తం చేసేందుకు వినియోగించే సైరన్‌లను వార్తా కార్యక్రమాల్లో ఉపయోగించవద్దని మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్‌ల సమయంలో పౌరులకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ విభాగాలు అడ్వైజరీ జారీ చేశాయి. "ఇలా తరచుగా ఈ శబ్దాలు వినియోగించడం ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయి. దీంతో వాస్తవంగా అత్యవసర సమయాల్లో వీటిని మోగించినప్పుడు పౌరులు వీటిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది" అని ప్రభుత్వం తెలిపింది.
Admin
Studio18 News