Monday, 23 June 2025 03:20:17 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

గోహత్యలు జరుగుతున్నాయ్.. అందుకే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి అంతమంది మృతి: బీజేపీ సీనియర్ నేత

Date : 03 August 2024 04:33 PM Views : 160

Studio18 News - జాతీయం / : కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందరి హృదయాలను కలచివేస్తున్న ఈ ఘటనపై రాజస్థాన్ బీజేపీ సీనియర్ నేత స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొండచరియలు విరిగిపడి అంతమంది చనిపోయిన ఘటనకు గోహత్యలే కారణమని ఆయన అన్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన గోహత్యకు పాపానికి సంబంధించిన ప్రత్యక్ష పరిణామంగా ఆయన అభివర్ణించారు. ఒకవేళ కేరళలో ఈ పద్ధతికి ఇకనైనా స్వస్తి చెప్పకపోతే ఇలాంటి విషాద ఘటనలు ఇంకా కొనసాగుతాయని హెచ్చరించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లోనూ అప్పుడప్పుడు మేఘాలు, కొండచరియలు విరిగిపడుతుంటాయని, అటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పటికీ వయనాడ్ దుర్ఘటన స్థాయిలో ఏమీ మరణాలు సంభవించడం లేదని అహుజా చెప్పారు. 2018 నుంచి గోహత్యలు జరిగిన ప్రాంతాలు వయనాడ్ ఇటువంటి విషాద సంఘటనలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గోహత్యలను అరికట్టకపోతే కేరళలో ఇలాంటి విషాదాలు కొనసాగుతాయని చెప్పారు. అహుజా చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :