Sunday, 08 March 2026 10:39:46 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదు: అమెరికా

Date : 03 June 2025 11:47 AM Views : 289

Studio18 News - జాతీయం / : భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) ఎనిమిదో వార్షిక సదస్సులో పాల్గొన్న లుట్నిక్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సమీప భవిష్యత్తులోనే కుదురుతుందని మీరు ఆశించవచ్చు" అని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయన్న ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, చైనా మినహా ఇతర దేశాలపై ఈ సుంకాలను జూలై 8 వరకు 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తమ వస్తువులపై అమెరికా విధించిన 26 శాతం అదనపు సుంకం నుంచి భారత్ పూర్తి మినహాయింపు కోరుతోంది. ఈ నేపథ్యంలో జూలై 8 లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో లుట్నిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిన్న భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్, అమెరికా పరస్పరం ఒకరి వ్యాపారాలకు మరొకరు ప్రాధాన్యంతో కూడిన మార్కెట్ ప్రవేశం కల్పించాలని కోరుకుంటున్నాయని, ఇరు దేశాల బృందాలు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కాగా, ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్‌లో పర్యటిస్తోంది. గత నెలలో, భారత ప్రధాన సంప్రదింపుల అధికారి, వాణిజ్య విభాగం ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వాషింగ్టన్‌లో నాలుగు రోజుల పర్యటన ముగించారు. వాణిజ్య చర్చలకు మరింత ఊతమిచ్చేందుకు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇటీవల వాషింగ్టన్‌లో పర్యటించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :