Thursday, 05 December 2024 02:48:31 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Telcos: 73 లక్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్ల ర‌ద్దు.. కార‌ణం ఏంటంటే..!

Date : 08 August 2024 11:32 AM Views : 74

Studio18 News - జాతీయం / : రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌ల‌మైన 73 ల‌క్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను టెలికం కంపెనీలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ తెలిపారు. ఆయా మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను రీవెరిఫై చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ (డాట్‌) టెల్కోల‌ను ఆదేశించింది. వివ‌రాల ధ్రువీక‌ర‌ణలో విఫ‌ల‌మైన కంపెనీలు, కనెక్ష‌న్ల‌ను ర‌ద్దు చేశాయి. న‌కిలీ ఐడీలు లేదా అడ్ర‌స్‌ల‌తో త‌ప్పుడు కనెక్ష‌న్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్య‌వ‌స్థ‌ని రూపొందించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా కేంద్రం వెల్ల‌డించింది. "ఇప్పటి వరకు 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను డాట్ గుర్తించింది. వాటిలో 73 లక్షల మొబైల్ కనెక్షన్‌లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల రీవెరిఫికేషన్‌లో విఫలం కావ‌డంతో డిస్‌కనెక్ట్ చేశాం" అని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియ‌జేశారు. అలాగే నకిలీ రుజువుల‌తో సిమ్‌లను యాక్టివేట్ చేయడానికి సంబంధించిన ప్రశ్నకు కూడా మంత్రి సమాధానమిచ్చారు. "పాన్-ఇండియా ప్రాతిపదికన అన్ని ఆపరేటర్లలో ఒక వ్యక్తి కలిగి ఉండే మొబైల్ కనెక్షన్ల నిర్ణీత పరిమితిని మించి దాదాపు 16 లక్షల మంది చందాదారులు కలిగి ఉన్న సుమారు 1.92 కోట్ల మొబైల్ కనెక్షన్‌లను డాట్‌ గుర్తించింది. వీటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దాదాపు 66 లక్షల మొబైల్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేశాయి. తద్వారా ఈ 16 లక్షల మంది చందాదారులకు మొబైల్ కనెక్షన్‌లను నిర్ణీత పరిమితిలోపు తీసుకురావ‌డం జ‌రిగింది" అని మంత్రి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :