Wednesday, 10 December 2025 02:29:22 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

కంపెనీలో అర్ధరాత్రి వరకు పని.. ఒత్తిడి మధ్య జాబ్ చేయలేకపోతున్నానని ఫోను చేసి ఏడుస్తూ చెప్పేది: పెరయిల్ తండ్రి

Date : 24 September 2024 03:39 PM Views : 271

Studio18 News - జాతీయం / : పుణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై)లో సీఏగా పనిచేస్తున్న అన్నా సెబాస్టియన్ పెరయిల్ (26) పనిఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. కేరళ యువతి అన్నా సెబాస్టియన్ పెరయిల్ 4 నెలల క్రితమే ఉద్యోగంలో చేరి, అధిక గంటలు పనిచేసి తీవ్ర ఒత్తిడికి గురైందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా, దీనిపై ఆ యువతి తండ్రి సిబి జోసెఫ్ మాట్లాడుతూ.. తన కూతురు ఈ ఏడాది మార్చి 18నే ఆ కంపెనీలో చేరిందని అన్నారు. వారం రోజుల తర్వాత ఆమె రెగ్యులర్ ఆడిటింగ్‌ను ప్రారంభించిందని, ఆ కంపెనీలో 6 ఆడిట్ టీమ్‌లు ఉన్నాయని చెప్పారు. తన కూతురిని 6వ జట్టులో చేర్చారని, అధిక పని అప్పజెప్పారని తెలిపారు. తన కూతురు అర్ధరాత్రి సమయంలోనూ పనిచేయాల్సి వచ్చిందని చెప్పారు. తిరిగి ఆమె రూమ్‌కు చేరుకున్న తర్వాత కూడా ఆమె తన పనితో సంబంధం లేని అదనపు పనిని చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆమెకు నిద్రపోవడానికి, తినడానికి కూడా సమయం లేదని అన్నారు. ఆమెపై పని ఒత్తిడి తీవ్రంగా పడిందని తెలిపారు. తన కూతురు పనిని షెడ్యూల్‌ సమయంలోనే చేసినప్పటికీ ఆమె మేనేజర్ ఆ పనిని సరైన సమయంలో రివ్యూ చేయలేదని అన్నారు. ఆ మేనేజర్ క్రికెట్ అభిమాని అని, క్రికెట్ మ్యాచు చూసేందుకు అందుకు తగ్గట్లుగా ఆయన తన షెడ్యూల్‌ను మార్చుకునే వారని చెప్పారు. దీంతో ఆమెకు అప్పగించిన పనిని రాత్రి వరకు కూర్చొని చేయాల్సి వచ్చేదని తెలిపారు. అంత ఒత్తిడి మధ్య తాను పనిచేయలేకపోతున్నానని, ఆమె ఫోను చేసి ఏడుస్తూ చెప్పేదని అన్నారు. రాజీనామా చేసి రావాలని తాము చెప్పేవాళ్లమని, అందుకు ఆమె ఒప్పుకోలేదని తెలిపారు. దురదృష్టవశాత్తూ జులై 21న ఆమె తన రూమ్‌లో పడిపోయిందని, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందిందని చెప్పారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఇవాళ తమను పరామర్శించారని, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :