Thursday, 05 December 2024 09:08:20 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

sexual harassment case kerala: ప్రకంపనలు సృష్టిస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్

Date : 27 August 2024 04:13 PM Views : 36

Studio18 News - జాతీయం / : కేరళ ప్రభుత్వానికి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. కమిటీ తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. కొంత మంది నటులు, నిర్మాతలు, దర్శకులు .. మహిళా ఆర్టిస్టులను లైంగికంగా వేధింపులకు గురి చేశారని, తీవ్ర ఇబ్బందులు పెట్టారని పేర్కొంది. జస్టిస్ హేమ కమిటీ నివేదికను సీరియస్‌గా తీసుకున్న పినరయి విజయన్ సర్కార్ .. విచారణ చేపట్టాలని నిర్ణయించింది. వెంటనే ఇందుకోసం ఏడుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మలయాళ చిత్ర పరిశ్రమలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ఓ నటి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వివరించారు. నలుగురు సహచర నటులు తనను లైంగికంగా వేధించి, దూషించారని ఆరోపించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జయసూర్య కారణంగా చేదు అనుభవం ఎదురైందని చెప్పారు. తాను బాత్ రూమ్ కు వెళ్లి వస్తుండగా, జయసూర్య వెనుక నుండి వచ్చి తనను కౌగిలించుకొని ముద్దు పెట్టాడని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే తాను అక్కడ నుండి వెళ్లిపోయానని ఆమె తెలిపారు. తనతో ఉంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తానని జయసూర్య ఆ తర్వాత తనతో చెప్పాడని ఆమె పేర్కొన్నారు. అసోసియేషన్ లో సభ్యత్వం కోసం మలయాళీ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ ఇడవేల బాబును తాను సంప్రదిస్తే ఇంటికి రమ్మని చెప్పాడని, తాను వెళ్లగా ఆయన శారీరకంగా వేధించాడని మరో మలయాళీ నటి ఆరోపించింది. నటుడు, సీపీఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం ముకేశ్, మణియన్‌పిళ్ల రాజుపై కూడా ఆమె ఇదే విధమైన ఆరోపణలు చేశారు. వేధింపుల కారణంగా మలయాళ చిత్ర పరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరుగా గతంలో చిత్ర సీమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టేందుకు మీడియా ముందుకు వస్తుండడం మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :