Thursday, 12 March 2026 12:35:55 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది కాల్చివేతపై భారత్ స్పందన

Date : 22 May 2025 05:37 PM Views : 403

Studio18 News - జాతీయం / : అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు దౌత్య కార్యాలయ సిబ్బందిని ఓ దుండగుడు కాల్చి చంపడం తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో "ఫ్రీ పాలస్తీనా" అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఈ దారుణ హత్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ యూదు మ్యూజియం సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది (ఒక పురుషుడు, ఒక మహిళ)పై నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. ఈ హత్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర పదజాలంతో ఖండించారు. "వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తల హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు మా ప్రగాఢ సానుభూతి. దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాలి" అని జైశంకర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. జైశంకర్ పోస్టుకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సేర్ స్పందిస్తూ, "ధన్యవాదాలు, ప్రియ మిత్రమా!" అని బదులిచ్చారు. ట్రంప్ ఆగ్రహం, దర్యాప్తు ఈ దారుణ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ద్వేషానికి, రాడికలిజానికి అమెరికాలో స్థానం లేదు. ఈ హత్యలు యూదు వ్యతిరేకతతో జరిగినవే. ఇలాంటి భయంకరమైన ఘటనలు తక్షణమే ఆగాలి" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. అధికారులు ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశ్యం, ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇజ్రాయెల్ కూడా తమ దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. మృతిచెందిన ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది వీరే...

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :