Saturday, 07 March 2026 09:10:41 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం!

రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

Date : 01 April 2025 01:10 PM Views : 476

Studio18 News - జాతీయం / : భార్య రీల్స్ స‌రదాకు భ‌ర్త కానిస్టేబుల్ ఉద్యోగం ఊడిన ఘ‌ట‌న చండీగఢ్‌లో చోటు చేసుకుంది. చండీగఢ్‌లోని సెక్టార్-20 గురుద్వారా చౌక్ వద్ద జీబ్రా క్రాసింగ్‌పై జ్యోతి అనే మ‌హిళకు సంబంధించిన రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ముప్పు వంటి నేరాల కింద ఆమెపై కేసు న‌మోదైంది. అలాగే జ్యోతి భ‌ర్త అయిన అజయ్ కుందు అనే సీనియర్ కానిస్టేబుల్‌ను చండీగఢ్ పోలీసులు సస్పెండ్ చేశారు. దీనికి కార‌ణం ఆ వీడియో అత‌ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్టు కావ‌డ‌మే. మార్చి 20న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి వివాదానికి దారితీసింది. సెక్టార్-32లోని ఒక ఆలయాన్ని సందర్శించిన తర్వాత జ్యోతి తన వదిన పూజ సహాయంతో డ్యాన్స్ రీల్‌ను చిత్రీకరించింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో జ్యోతి ట్రాఫిక్ జామ్‌ను పట్టించుకోకుండా ఒక పంజాబీ పాట‌కు నృత్యం చేయ‌డం క‌నిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్-34 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అత‌ని ఫిర్యాదు మేర‌కు ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్-20లోని గురుద్వారా చౌక్, సెక్టార్-17లోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షించింది. వాటి ఆధారంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద జ్యోతి, పూజల‌పై బీఎన్ఎస్‌ సెక్షన్లు 125, 292, 3(5) కింద కేసు నమోదు చేశారు. సెక్టార్-19 పోలీస్ స్టేషన్‌లో సీనియ‌ర్‌ కానిస్టేబుల్‌గా ప‌నిచేసే అజయ్ కుందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ వీడియోను అప్‌లోడ్ చేయడంతో అత‌డిని కూడా సస్పెండ్ చేశారు. అయితే, జ్యోతి, పూజలకు వెంటనే బెయిల్ మంజూరైంది.

#reelsfeed #police #chandigarh

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :