Saturday, 07 March 2026 09:00:54 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

స‌రిహ‌ద్దుల్లో పాక్‌ కాల్పులు.. తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

Date : 09 May 2025 01:24 PM Views : 361

Studio18 News - జాతీయం / : ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఆప‌రేష‌న్‌ను సహించ‌లేని దాయాది పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధితో భార‌త స‌రిహ‌ద్దు ప్రాంతాల‌పై క్షిప‌ణి, డ్రోన్ దాడుల‌కు పాల్ప‌డుతోంది. ఈ క్రమంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో పాకిస్థాన్ జ‌రిపిన కాల్పుల్లో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందారు. మృతిచెందిన జ‌వాన్‌ను ముర‌ళీ నాయ‌క్‌గా గుర్తించారు. వీర జవాన్‌ది ఏపీలోని స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌ల ప‌రిధిలోని క‌ల్లి తండా. గురువారం రాత్రి స‌రిహ‌ద్దు వెంబ‌డి పాక్ కాల్పులు జ‌ర‌ప‌గా మ‌న సైన్యం కూడా దీటుగానే బదులిచ్చింది. ఈ ఎదురుకాల్పుల్లో ముర‌ళీ నాయ‌క్ చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం. శ‌నివారం స్వ‌గ్రామానికి వీర జ‌వాన్ పార్థివ దేహం రానున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, వీర జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ సోమందేప‌ల్లి మండ‌లం నాగినాయ‌ని చెరువుతండాలో పెరిగాడు. సోమందేప‌ల్లిలోని విజ్ఞాన్ స్కూల్‌లో చ‌దివాడు. జ‌వాన్ మృతితో ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. దీంతో స్వ‌గ్రామం క‌ల్లితండాలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :