Saturday, 17 January 2026 08:49:37 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

భారత పర్యాటకుడిపై పులి దాడి.. థాయ్ లాండ్ లో ఘటన.. వీడియో ఇదిగో!

Date : 30 May 2025 02:38 PM Views : 324

Studio18 News - జాతీయం / : థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత టైగర్ కింగ్‌డమ్‌ను సందర్శించిన భారతీయ పర్యాటకుడికి భయంకరమైన అనుభవం ఎదురైంది. పులితో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ఉండగా అది ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. భారతీయ పర్యాటకుడు పుకెట్ లోని టైగర్ కింగ్‌డమ్‌లో ఒక పులి పక్కన నడుస్తూ, ఫోటో కోసం కింద కూర్చున్నాడు. ఆ సమయంలో ట్రైనర్ ఒకరు కర్ర సాయంతో పులిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, అనూహ్యంగా ఆ పులి పర్యాటకుడిపైకి లంఘించింది. ఈ దృశ్యాలను సిద్దార్థ్ శుక్లా అనే ఎక్స్ (ట్విట్టర్) యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. "థాయ్‌లాండ్‌లో ఒక భారతీయ పర్యాటకుడిపై పులి దాడి చేసినట్లు తెలుస్తోంది. టైగర్ కింగ్‌డమ్‌లో పులులకు తగిన శిక్షణ ఇస్తారు. తగిన రుసుము వసూలు చేసి పులితో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు పర్యాటకులకు అవకాశం కల్పిస్తారు. ఇలా శిక్షణ ఇచ్చిన పులితో సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలోనే ఈ దాడి జరిగింది" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పులి దాడి నుంచి సదరు పర్యాటకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడని సిద్దార్థ్ శుక్లా కామెంట్స్ విభాగంలో తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, జంతువుల సంక్షేమంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. "ఎప్పుడూ ఇలాంటి సాహసాలకు పోవద్దు. జంతువులు జంతువులే. వాటి పట్ల దయగా ఉండండి, కానీ అవి కూడా అలాగే స్పందిస్తాయని ఆశించవద్దు" అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. బంధించి ఉంచిన వన్యప్రాణులతో దగ్గరగా మెలగడాన్ని అనుమతించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి విమర్శకులు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అసహజ పరిస్థితుల్లో ఉంచడం వల్ల అవి ప్రమాదకరంగా ప్రవర్తించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :