Sunday, 25 January 2026 05:44:01 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Bengal Doctors: కోల్‌క‌తా వైద్య విద్యార్థుల ఆందోళ‌న విర‌మ‌ణ‌.. కీల‌క ప్ర‌క‌ట‌న‌!

Date : 20 September 2024 11:39 AM Views : 358

Studio18 News - జాతీయం / : కోల్‌క‌తా ట్రైనీ వైద్యురాలిపై హ‌త్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టిన ఆర్‌జీ క‌ర్ వైద్య విద్యార్థులు 41 రోజుల త‌ర్వాత ఆందోళ‌న విర‌మించారు. రేప‌టి (శ‌నివారం) నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో పాల్గొంటామ‌ని తెలిపారు. బెంగాల్ ప్ర‌భుత్వంతో రెండు ద‌ఫాల చ‌ర్చ‌ల అనంత‌రం వైద్య విద్యార్థులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం మ‌మ‌తా బెన‌ర్జీతో వారి చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో విద్యార్థులు నిర‌స‌న‌ల‌ను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారి ప‌లు డిమాండ్ల‌కు ముఖ్య‌మంత్రి అంగీక‌రించారు. దీనిలో భాగంగా కోల్‌క‌తా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వినీత్ గోయ‌ల్‌ను త‌ప్పించి ఆయ‌న స్థానంలో మ‌నోజ్ కుమార్ వ‌ర్మ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలాగే మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ కౌస్త‌వ్ నాయ‌క్‌, హెల్త్ స‌ర్వీస్ డైరెక్ట‌ర్ దేవాశిష్ హ‌ల్డేర్‌ల‌ను వారి పోస్టుల నుంచి తొల‌గించ‌డం జ‌రిగింది. ఇక వైద్య విద్యార్థులు రెండో ద‌ఫాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధ‌వారం భేటీ అయ్యారు. అనంత‌రం త‌మ ఆందోళ‌న విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న చేశారు. "మా నిర‌స‌న విర‌మిస్తున్నాం. ఈ కేసును త్వ‌ర‌గా విచారించాల‌ని కోరుతూ గురువారం మ‌ధ్యాహ్నం సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేప‌డుతున్నాం. వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. రోగుల‌కు వైద్య సేవ‌లు అందించ‌డానికి శ‌నివారం నుంచి విధుల్లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అత్య‌వ‌స‌ర సేవ‌ల్లో పాల్గొంటాం. అయితే, కోల్‌క‌తాలోని అన్ని మెడిక‌ల్ కాలేజీల వ‌ద్ద ధర్నా మంచాస్ అలాగే కొన‌సాగుతాయి" అని ఓ డాక్ట‌ర్ చెప్పుకొచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :