Sunday, 08 February 2026 11:32:43 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

రాజస్థాన్‌లో మాజీ మంత్రి పీఏ అరెస్ట్.. పాక్‌తో గూఢచర్యం ఆరోపణలు!

Date : 29 May 2025 12:04 PM Views : 326

Studio18 News - జాతీయం / : రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో అరెస్టవడం సంచలనం రేపుతోంది. గతంలో ఆయన ఒక మంత్రి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) పనిచేయడం గమనార్హం. రాజస్థాన్‌ రాష్ట్ర ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న సకూర్ ఖాన్ మగళియార్‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారం చేరవేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. సకూర్ ఖాన్.. పాక్ సరిహద్దుల్లోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామానికి చెందిన మంగళియార్ ధానికి చెందిన వ్యక్తి. గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా సకూర్ ఖాన్ పనిచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, సదరు మాజీ మంత్రి కూడా బరోడా గ్రామానికే చెందినవారు కావడం గమనార్హం. గత కొన్ని వారాలుగా సకూర్ ఖాన్ కార్యకలాపాలపై దర్యాప్తు బృందాలు నిఘా ఉంచాయి. పాకిస్థాన్ దౌత్య కార్యాలయంతో అతనికి సంబంధాలున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. "సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి మాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని నిర్ధారించుకుని, ప్రశ్నించేందుకే అతడిని అరెస్ట్ చేశాం" అని ఎస్పీ సుధీర్ చౌధ్రీ మీడియాకు తెలిపారు. అధికారులు సకూర్ ఖాన్ మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా, అందులో పలు పాకిస్థానీ ఫోన్ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నంబర్ల గురించి ఖాన్ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడం లేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. తాను ఇప్పటివరకు ఏడుసార్లు పాకిస్థాన్ వెళ్లివచ్చినట్లు ఖాన్ విచారణలో అంగీకరించాడు. ప్రస్తుతం అతని ఫోన్‌లో ఎలాంటి సైనిక రహస్య సమాచారం లభించనప్పటికీ, కొన్ని ఫైళ్లను డిలీట్ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. ఖాన్‌కు సంబంధించిన రెండు బ్యాంకు ఖాతాలపై కూడా అధికారులు దృష్టి సారించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :