Thursday, 12 March 2026 03:12:44 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

యూపీఎస్సీ ఛైర్మ‌న్‌గా అజ‌య్ కుమార్

Date : 14 May 2025 02:17 PM Views : 392

Studio18 News - జాతీయం / : యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ (UPSC) ఛైర్మ‌న్‌గా ర‌క్ష‌ణ శాఖ మాజీ కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్‌ను కేంద్రం నియ‌మించింది. ఏప్రిల్ 29న ప్రీతి సుద‌న్ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత‌ యూపీఎస్సీ ఛైర్మ‌న్‌ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో తాజాగా అజ‌య్ కుమార్‌ను యూపీఎస్సీ ఛైర్మ‌న్‌గా నియ‌మిస్తూ కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయ‌న నియామ‌కాన్ని రాష్ట్ర‌పతి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. 1985 నాటి ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అజ‌య్ కుమార్‌ది కేర‌ళ క్యాడ‌ర్‌. 2019 ఆగ‌స్టు 23 నుంచి 2022 అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు ర‌క్ష‌ణ‌శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. ఐఏఎస్, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇత‌ర ప‌రీక్ష‌ల‌ను యూపీఎస్సీ నిర్వ‌హించే విష‌యం తెలిసిందే. యూపీఎస్సీకి ఓ ఛైర్మ‌న్, 10 మంది స‌భ్యులు ఉంటారు. ప్రస్తుతం కమిషన్‌లో ఇద్దరు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇక‌, యూపీఎస్సీ ఛైర్మ‌న్‌ను ఆరేళ్ల కోసం అపాయింట్ చేస్తారు. లేదా ఆ వ్య‌క్తి వ‌య‌సు 65 ఏళ్లు దాట‌కుండా ఉండాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :