Thursday, 05 December 2024 08:49:50 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక ప్రకటన

Date : 01 October 2024 11:36 AM Views : 24

Studio18 News - జాతీయం / : కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్న ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదైన గంటల వ్యవధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) నుంచి తాను పొందిన 14 పరిహార భూములను తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ముడాకు ఆమె లేఖ రాశారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. తన భర్త, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో కఠినమైన నైతిక నిబంధలను పాటించారని, ఎలాంటి మచ్చ లేకుండా నడుచుకున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. ‘‘ నా భర్త సిద్ధరామయ్య రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను జీవించాను. నా భర్త కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు’’ అని లేఖలో ఆమె పేర్కొన్నారు. కాగా భూముల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కామ్‌లో పార్వతిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై కూడా ఆమె స్పందించారు. తన వ్యక్తిగత సంపద లేదా ఆస్తి కోసం ఎప్పుడూ తాను వెతకలేదని అన్నారు. తన భర్త ప్రజల గౌరవాన్ని పొందడం తనకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త గౌరవానికి మించిన భౌతిక సంపద ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ఇక ఆస్తులు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్న తన భార్య నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య కూడా ప్రకటించారు. కాగా సీఎం సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ల కింద కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్) దాఖలు చేసింది. ఈసీఐఆర్ అంటే పోలీసు ఎఫ్ఐఆర్‌తో సమానమని ఈడీ వర్గాలు తెలిపాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :