Sunday, 25 January 2026 06:08:10 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Pawan Kalyan: ఎస్సీ వర్గీకరణకు జనసేన సంపూర్ణ మద్దతు.. వారితోనూ మాట్లాడామన్న పవన్ కల్యాణ్

సీఎం వర్గీకరణ అంశంపై నాలుగు నెలల్లో ఏక సభ్య కమిషన్ వేయటంతో పాటు మంత్రుల కమిటీని వేశారని చెప్పారు.

Date : 20 March 2025 05:39 PM Views : 328

Studio18 News - జాతీయం / : అమరావతి రాజధాని – ఎస్సీ వర్గీకరణపై చాలా మంది మేధావులతో చర్చలు జరిపామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “మాలమాదిగ ఐక్యత గురించి కూడా చాలా మంది మేధావులు మాట్లాడారు. ఈ రెండు కులాలతో పాటు ఉపవర్గాలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై విస్తృతంగా చర్చలు జరిగాయి” అని అన్నారు.

“రెల్లి, బేడబుడగ జంగాలు, దళితులకంటే వెనుకబడిన యానాదులు గురించి అధ్యయనం చేసిన వారితోనూ మాట్లాడాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఇంతవరకూ వచ్చింది మందకృష్ణ మాదిగతో అయినా.. దానిని ముందుకు తీసుకెళ్లింది సీఎం చంద్రబాబే. మందకృష్ణ మాదిగలకు ఆత్మగౌరవాన్ని తెచ్చారు. ఆయనకు అభినందనలు తెలియచేస్తున్నా. తెలంగాణలో మాదిగలు ఎక్కువ, ఏపీలో మాలలు ఎక్కువ. వివిధ రాష్ట్రాల్లో వివిధ ఉపకులాలు ఎక్కువ తక్కువలు ఉన్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న వర్గీకరణను సమర్థిస్తున్నా. 100 నుంచి 10 వేల మంది లోపు ఉన్న 46 ఉపకులాలు ఉన్నట్టు రాజీవ్ రంజన్ మిశ్రా చెప్పారు. సీఎం వర్గీకరణ అంశంపై నాలుగు నెలల్లో ఏక సభ్య కమిషన్ వేయటంతో పాటు మంత్రుల కమిటీని వేశారు. ఎస్సీల ఆర్థిక రాజకీయ సామాజిక వెనుకబాటు తనాలపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ బాగా అధ్యయనం చేసింది. మందకృష్ణ వర్గీకరణ పోరాటానికి ఆద్యుడు, చంద్రబాబు సైబరాబాద్ సృష్టికర్త- వర్గీకరణ రూపకర్త. ప్రధాని మోదీ వర్గీకరణ ప్రధాత అయ్యారు. బేడ, బుడగ జంగాలు, రెల్లి కులాలకు కూడా ఏదో విధంగా న్యాయం చేయాలి. ఈ నివేదికను జనసేన సంపూర్ణ మద్ధతు తెలియచేస్తోంది” అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :