Studio18 News - జాతీయం / : Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ లో మంగళవారం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మరుసటిరోజే బుధవారం ఉగ్రవాదులు బరితెగించారు. విధుల్లో ఉన్న ఇద్దరు సైనికులను కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఉగ్రవాదుల చెర నుంచి ఓ జవాన్ తప్పించుకొని బయటపడగా.. మరో జవాన్ ను ఉగ్రవాదులు చంపేశారు. దీంతో భారత్ ఆర్మీ ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే, అనంత్ నాగ్ జిల్లాలో భద్రతా దళాలు తప్పిపోయిన టెరిటోరియల్ ఆర్మీకి చెందిన హిలాల్ అహ్మద్ భట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అనంత్ నాగ్ జిల్లాలోని ఉత్రాసూ ప్రాంతంలోని సాంగ్లాన్ అటవీ ప్రాంతంలో హిలాల్ అహ్మద్ భట్ మృతదేహాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. హిలాల్ బాడీపై బుల్లెట్ గాయాలను గుర్తించారు. అతనిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Admin
Studio18 News