Sunday, 08 February 2026 10:48:51 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

పాక్ లో డాక్టర్ అఫ్రీదీని తక్షణం విడుదల చేయాలి: శశి థరూర్

Date : 08 June 2025 05:22 PM Views : 319

Studio18 News - జాతీయం / : ప్రపంచాన్ని వణికించిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అగ్రనేత ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి కీలక సమాచారం అందించి సాయపడిన పాకిస్థానీ వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీ పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్ అఫ్రీదీని తక్షణమే విడుదల చేయాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ చేసిన డిమాండ్‌కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శశి థరూర్ శనివారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ గురించి వివరించేందుకు శశి థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష కమిటీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన ఓ సమావేశంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్, డాక్టర్ షకీల్ అఫ్రీదీ నిర్బంధం విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన థరూర్, "బ్రాడ్ షెర్మన్ డిమాండ్‌ను మేము స్వాగతిస్తున్నాం. పాకిస్థాన్, బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించింది. ఆయన ఎక్కడ ఉన్నాడన్న రహస్యాన్ని బయటపెట్టాడన్న ఆరోపణలతో ఓ వైద్యుడిని అక్రమంగా అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేస్తోంది. ఒకవేళ ఆ వ్యక్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఉంటే, వారికి అవార్డులు, రివార్డులు దక్కేవి" అంటూ పాకిస్థాన్ వైఖరిని తప్పుబట్టారు. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిం మునీర్‌కు దేశ అత్యున్నత సైనిక హోదా అయిన ‘ఫీల్డ్ మార్షల్’గా పదోన్నతి కల్పించిన విషయాన్ని థరూర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. డాక్టర్ షకీల్ అఫ్రీదీని విడుదల చేయాలని పాకిస్థాన్ నాయకత్వానికి శశి థరూర్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అఫ్రీదీ విడుదలైతే, అది 9/11 నాటి, ముంబయి ఉగ్రదాడుల బాధితులకు న్యాయం చేకూర్చడంలో ఒక కీలక ముందడుగు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసలేం జరిగింది? పాకిస్థాన్‌కు చెందిన వైద్యుడైన షకీల్ అఫ్రీదీ, ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలను సేకరించేందుకు సీఐఏ నిర్వహించిన నకిలీ పోలియో టీకా కార్యక్రమంలో పాలుపంచుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ సమాచారం ఆధారంగానే, 2011 మే నెలలో అమెరికా నేవీ సీల్స్ పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌ మిలిటరీ కంటోన్మెంట్‌ సమీపంలోని ఓ రహస్య స్థావరంలో నక్కిన ఒసామా బిన్ లాడెన్‌పై దాడి చేసి మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి అఫ్రీదీ అందించిన సమాచారమే కారణమని భావించిన పాకిస్థాన్ నిఘా వర్గాలు, ఆయన్ను వెంటనే అరెస్టు చేశాయి. దేశద్రోహం ఆరోపణలపై విచారణ జరిపిన అక్కడి కోర్టు, 2012లో అఫ్రీదీకి 33 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఆయన విడుదల కోసం అమెరికా పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ, పాకిస్థాన్ ప్రభుత్వం ససేమిరా అంటోంది. తాజాగా శశి థరూర్ కూడా ఈ డిమాండ్‌కు గొంతు కలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :