Sunday, 08 February 2026 01:16:01 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

ఆపరేషన్ సిందూర్ మృతులపై పాక్ ప్రకటన

Date : 08 May 2025 12:09 PM Views : 343

Studio18 News - జాతీయం / : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతిచర్యగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ జరిపన దాడుల్లో 31 మంది మరణించారని, మరో 46 మంది గాయపడ్డారని పాకిస్థాన్ సైనిక ప్రతినిధిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు, పాకిస్థాన్ దళాలు గత 14 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. తాజాగా మే 7-8 తేదీల మధ్య జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం చిన్న ఆయుధాలు, ఫిరంగి గుండ్లతో కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఈ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. పూంచ్‌లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్‌లో పౌరులు మృతి చెందడం, గురుద్వారా దెబ్బతినడం పట్ల శ్రీ అకాల్ తఖ్త్ జతేదార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "యుద్ధం మానవాళికి ఎప్పుడూ ప్రమాదకరమే. పాకిస్థాన్ షెల్లింగ్‌లో పౌరుల మృతిని, పూంచ్‌లోని గురుద్వారాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాలు తక్షణ చర్యలు తీసుకోవాలని అకాల్ తఖ్త్ తాత్కాలిక జమేదార్ జియానీ కుల్దీప్ సింగ్ గర్గజ్ కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :