Wednesday, 16 July 2025 11:53:55 PM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

ఒడిశా ఆసుపత్రిలో ఘోరం.. ఇంజెక్షన్ తర్వాత ఐదుగురు రోగుల మృతి!

Date : 04 June 2025 12:41 PM Views : 48

Studio18 News - జాతీయం / : ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో ఉన్న సహీద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మంగళవారం అర్ధరాత్రి కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. వైద్య సిబ్బంది ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), సర్జికల్ వార్డులలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఐదుగురు వ్యక్తులు గత రాత్రి మరణించారు. అంతకు కొన్ని నిమిషాల ముందు ఆసుపత్రి సిబ్బంది వీరికి రెండో విడత ఇంజెక్షన్లు ఇచ్చినట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. "అర్ధరాత్రి సమయంలో ఒక నర్సు మా పక్కనే ఉన్న ముగ్గురు రోగులకు ఇంజెక్షన్ ఇచ్చింది. మా సోదరికి కూడా అదే ఇంజెక్షన్ వేసింది. అది వేసిన కొన్ని క్షణాల్లోనే ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయింది. మేము డాక్టర్‌ను పిలిచి, ఆయన వచ్చి పరీక్షించేలోపే ఆమె ప్రాణాలు విడిచింది" అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారందరూ అంతకుముందు ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, ఆపరేషన్ల అనంతరం వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని బంధువులు పేర్కొన్నారు. అయితే, నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మృతుల కుటుంబ సభ్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :